Peddapalli: సర్పంచ్ రంజిత్ వివాహ వేడుక.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రి!
Peddapalli: పెద్దపల్లిలో బొట్లవనపర్తి సర్పంచ్ రంజిత్-కోమలత వివాహ వేడుకకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Peddapalli: సర్పంచ్ రంజిత్ వివాహ వేడుక.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రి!
Peddapalli: పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ధర్మారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, బొట్లవనపర్తి గ్రామ సర్పంచ్ రంజిత్ కోమలత వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెద్దపల్లిలోని కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకకు ఉదయం నుండే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రి రాకతో వేడుకకు మరింత శోభ వచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేదికపైకి రాగానే సర్పంచ్ రంజిత్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్, వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు తో కలిసి మంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అన్యోన్య దాంపత్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి, ధర్మారం మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
రంజిత్ - కోమలత వివాహ వేడుక మంత్రి, ఎమ్మెల్యేల రాకతో మరింత ఘనంగా జరిగింది... నూతన దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.