Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నరేందర్ రెడ్డి!
Karimnagar: కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నరేందర్ రెడ్డి!
Karimnagar: మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయం బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం హుస్సేనీపుర బొంబాయి స్కూల్ నుంచి ఉదయం 10 గంటలకు మొదలైన ర్యాలీని మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, ప్రధాన కార్యదర్శి గులాం రబ్బాని ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు.
సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున తెహజీబ్ను కాపాడటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని ఆ మహనీయుడు చూపిన బాటలో నడిచి ప్రతి ఒక్కరూ జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.