Manthani: మంథనిలో మార్గదర్శి విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో మార్గదర్శి విద్యానికేతన్ 2000-01 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న మిత్రులు.

Update: 2026-08-16 15:01 GMT

Manthani: మంథనిలో మార్గదర్శి విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాలలో 2000–2001 సంవత్సరంలో పదవతరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించుకున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాలలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకోవడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని పూర్వ విద్యార్థులు తెలిపారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ తమ ప్రస్తుత స్థితిగతులను, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News