Karimnagar: కరీంనగర్‌లో అందుబాటులోకి నూతన జిల్లా గ్రంథాలయం

Karimnagar: కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన డిజిటల్ గ్రంథాలయ భవనాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు.

Update: 2026-07-16 03:14 GMT

Karimnagar: కరీంనగర్‌లో అందుబాటులోకి నూతన జిల్లా గ్రంథాలయం

కరీంనగర్: పోటీ పరిక్షల అభ్యర్థులు, పాఠకుల సౌకర్యార్ధం అత్యాధుని హంగులతో నిర్మాణం చేసిన డిజిటల్ గ్రంథాలయాన్ని త్వరగా వినియోగంలోకి తెస్తామని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణం చేసిన నూతన జిల్లా గ్రంథాలయ భవనాన్ని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు.

గ్రంథాలయ భవనంలోని చివరి దశ పనులతో పాటు పేయింటింగ్, రేయిలింగ్ ఇతర అభివృద్ధి పనులను తనిఖీ చేసి పరిశీలించారు. గ్రంథాలయంలో కావల్సిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి చివరి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు, పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైబ్రరీలో అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చదువుకోవడానికి అనుకూలంగా ఉండేలా నాణ్యమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

చివరి దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, డిజిటల్ లైబ్రరీని వీలైనంత త్వరగా ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ భవన ప్రారంభోత్సవానికి సంబంధించి తగిన ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News