Karimnagar: కరీంనగర్ పోలీసుల సమర్థత: 48 గంటల్లో బంగారం లభ్యం

Karimnagar: కరీంనగర్‌లో పోగొట్టుకున్న 2.5 తులాల బంగారాన్ని 48 గంటల్లోనే టూ టౌన్ పోలీసులు రికవరీ చేశారు. సీఐ సృజన్ రెడ్డి బాధితురాలు శ్రీలతకు దానిని అప్పగించారు.

Update: 2026-07-27 05:34 GMT

Karimnagar: కరీంనగర్ పోలీసుల సమర్థత: 48 గంటల్లో బంగారం లభ్యం

కరీంనగర్: కరీంనగర్‌లో సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న సిగిరి శ్రీలత ఇటీవల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌కు షాపింగ్ నిమిత్తం వచ్చిన సందర్భంగా అనుకోకుండా 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని రోడ్డుపై పోగొట్టుకున్నారు.

ఈ విషయమై సమాచారం అందుకున్న కరీంనగర్ టూ టౌన్ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిరంతర శ్రమతో 48 గంటల్లోనే పోగొట్టుకున్న 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని బాధితురాలు సిగిరి శ్రీలత కి అప్పగించారు.

తనకు అత్యంత విలువైన 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని అతి తక్కువ సమయంలో గుర్తించి అప్పగించిన టూ టౌన్ పోలీసుల పని తీరును సిగిరి శ్రీలత అభినందిస్తూ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో విశేష కృషి చేసిన క్రైమ్ టీం కానిస్టేబుళ్లు సాయికిరణ్, అజయ్ కుమార్లను టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ సృజన్ రెడ్డి అభినందించి, వారి అప్రమత్తత, అంకితభావం, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు.

Tags:    

Similar News