Jammikunta: నిరుపేద కుటుంబానికి అండగా బీఎస్పీ నేత అంబాల ప్రభాకర్

Jammikunta: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బీఎస్పీ హుజూరాబాద్ ఇంచార్జీ డాక్టర్ అంబాల ప్రభాకర్. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి.

Update: 2026-08-07 14:28 GMT

Jammikunta: నిరుపేద కుటుంబానికి అండగా బీఎస్పీ నేత అంబాల ప్రభాకర్

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజూరాబాద్ అసెంబ్లీ ఇంచార్జీ డాక్టర్ అంబాల ప్రభాకర్. సుమారు ఐదు సంవత్సరాల క్రితం సుమలత అనే మహిళ మెదడు సంబంధిత తీవ్రమైన అనారోగ్యానికి గురై నాలుగు సార్లు శస్త్రచికిత్స చేయించుకోగా లక్షల్లో అప్పులు అయ్యాయి ఆ క్లిష్ట పరిస్థితిలో దాతల సహకారంతో ఆమెకు ఆర్థిక సహాయం అందేలా డాక్టర్ అంబాల ప్రభాకర్ కృషి చేసినట్లు తెలిపారు.

అలాగే, జమ్మికుంట సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కరస్పాండెంట్ సునీల్ సహకారంతో ఎలాంటి ఫీజులు లేకుండా ఆమె ఇద్దరు పిల్లలకు గత ఐదు సంవత్సరాలుగా నాణ్యమైన ఉచిత విద్య పాటు ఉచిత బస్సు సౌకర్యం అందేలా కృషి చేసినట్లు తెలిపారు.పండుగలు, పుట్టిన రోజులు వంటి సందర్భాల్లో పిల్లలకు కొత్త దుస్తులు అందిస్తూ వారి అవసరాలను తీర్చేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు.

కుటుంబ పరిస్థితులు మరింత విషమంగా మారిన నేపథ్యంలో, కుటుంబానికి భద్రతగా ఉండవలసిన తండ్రి ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఇటీవల జమ్మికుంట పోక్సో చట్టం కింద కేసు నమోదై ప్రస్తుతం జైలులో ఉన్నట్లు తెలిపారు.

జైల్ నుండి విడుదలైన తరువాత తనను తన పిల్లలను చంపుతాడని భయంతో ప్రభు ను ఆశ్రయించినట్లు తెలిపారు.పిల్లల భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు కాఫీ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు.

అంతే కాకుండా ఈ కుటుంబానికి ఇంకా ఆర్థిక సహాయం, పిల్లల విద్య, పోషణ కోసం దాతల సహకారం అవసరమని డాక్టర్ అంబాల ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమాజంలోని దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి ఈ తల్లి–బిడ్డలకు అండగా నిలవాలని కోరారు.డాక్టర్ అంబాల ప్రభాకర్ బీఎస్పీ హుజూరాబాద్ అసెంబ్లీ ఇంచార్జీ.9866935532,7093835532.

Tags:    

Similar News