Karimnagar: రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్గా అడిషనల్ కలెక్టర్ నియామకం!
Karimnagar: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ వైస్ ప్రెసిడెంట్గా అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి నియామకం.
Karimnagar: రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్గా అడిషనల్ కలెక్టర్ నియామకం!
Karimnagar: జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు సూచన మేరకు కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ చైర్మన్ సంగెం లక్ష్మణరావు ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈరోజు అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి ని, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) స్వామి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష సహకారం అందించిన జిల్లా అధికారులందరికీ చైర్మన్ సంగెం లక్ష్మణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించడం ఎంతో గర్వకారణమని, ఈ ఘనత సాధించినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ విజయానికి ప్రధాన కారణం జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, జిల్లా యంత్రాంగం అందించిన సహకారం, వివిధ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి అని చైర్మన్ సంగెం లక్ష్మణరావు తెలిపారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది కేవలం ఒక సేవా సంస్థ మాత్రమే కాకుండా మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధికారుల సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులందరికీ, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ చైర్మన్ సంగెం లక్ష్మణరావు మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, కుందారపు మహేశ్వర్, పెద్ది విద్యాసాగర్, కోల అన్నారెడ్డి, రాగి శ్రీనివాస్, రాజిరెడ్డి, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి కాళి చరణ్ గౌడ్, కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి,
రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, జలాలుద్దీన్, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.