Jammikunta: జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయంగా రాఖీ వేడుకలు!
Jammikunta: జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లు తోటి సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
Jammikunta: జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయంగా రాఖీ వేడుకలు!
Jammikunta: రక్షాబంధన్ పండుగ సందర్భంగా జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో అన్నాచెల్లెళ్ల అనుబంధం, ఆత్మీయతను చాటిచెప్పే కార్యక్రమం జరిగింది. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు తమ డ్యూటీని నిర్వర్తిస్తూనే రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
తోటి పురుష కానిస్టేబుళ్లకు మహిళా పోలీసులు రాఖీలు కట్టి, అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో పవిత్రమైనదని తెలిపారు. రాఖీ కట్టిన అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎప్పుడూ ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసు సిబ్బంది, పండుగ రోజున కూడా తమ బాధ్యతలను కొనసాగిస్తూ రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది.
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను పోలీస్ స్టేషన్‌లో జరుపుకోవడం ద్వారా మహిళా పోలీసులు సోదరభావాన్ని చాటిచెప్పారు. విధి నిర్వహణతో పాటు సంప్రదాయాలను గౌరవిస్తూ రాఖీ పండుగను జరుపుకున్న జమ్మికుంట మహిళా పోలీసులపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంజీవ్ .కానిస్టేబుల్ జలంధర్. క్రాంతి. రాజు. మహేందర్. అరుణ్. సోనీ. సౌమ్య. పాల్గొన్నారు