Jagtial: మాల్టాలో రోడ్డు ప్రమాదం: జగిత్యాల యువకుడు దుర్మరణం!

Jagtial: యూరప్ మాల్టాలో రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు జవ్వాద్ మృతి; మృతదేహం స్వగ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యుల వేడుకోలు.

Update: 2026-08-12 01:49 GMT

Jagtial: మాల్టాలో రోడ్డు ప్రమాదం: జగిత్యాల యువకుడు దుర్మరణం!

Jagtial: ఉపాధి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లిన ఒక యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జవ్వాద్ (27) అనే యువకుడు యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జవ్వాద్ మాల్టాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఆయన కారులో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కు వేగంగా వచ్చి జవ్వాద్ కారును బలంగా ఢీకొట్టింది.

ఈ భయానక ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో జవ్వాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతమైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో ఇస్లాంపూర్‌లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

చేతికి అందిన కొడుకు దూరమవ్వడంతో జవ్వాద్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జవ్వాద్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News