Jagtial: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

Jagtial: జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలకు యామాపూర్ - ఫకీర్ కొండాపూర్ మధ్య తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోయి ప్రజల తీవ్ర అవస్థలు.

Update: 2026-07-30 09:08 GMT

Jagtial: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

జగిత్యాల: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యామాపూర్ - ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో, రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వర్షం వస్తే చాలు.. ఆ ఊరి ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతోంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ వాసులకు వర్షాకాలం వచ్చిందంటే నరకం కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు యామాపూర్ - ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి తాకిడికి వాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఫకీర్ కొండాపూర్ గ్రామస్థులు మెట్టుపల్లి పట్టణానికి మరియు రావాలంటే మండల కేంద్రానికి రావాలన్న దాదాపు 10 కిలోమీటర్లకు పైగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ తిప్పలు ఈనాటివి కావు.. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం తలపెట్టినప్పటికీ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో, అధికారులు వేసిన తాత్కాలిక వంతెనే ఆధారమైంది. అయితే ప్రతీ వర్షాకాలంలో వాగు పొంగినప్పుడల్లా ఈ వంతెన కొట్టుకుపోవడం, రాకపోకలు బంద్ కావడం రివాజుగా మారింది.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. యుద్దప్రాతిపదికన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, తమను ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News