Sircilla: రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ కీలక ఆదేశాలు!

Sircilla: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ కీలక ఆదేశాలు. బాధితులను కాపాడిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌కు రూ.25 వేల 'రహవీర్' ప్రోత్సాహకం.

Update: 2026-07-14 05:53 GMT

Sircilla: రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ కీలక ఆదేశాలు!

Sircilla: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో గత మూడు నెలల ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి, ప్రమాదకర ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

వేములవాడ కమాన్ నుంచి కొదురుపాక వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వేములవాడ–దొంగలమర్రి రహదారి మరమ్మతులకు రూ.13.90 లక్షలతో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే ప్రధాన రహదారులపైకి వచ్చిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించిన సిరిసిల్లకు చెందిన ఆటో డ్రైవర్ పీ. శ్రీనివాస్‌కు రహవీర్ పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహక నగదు అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమావేశంలో వెల్లడించారు.

గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, స్కూల్ బస్సులు, ఆటోల్లో నిబంధనల ప్రకారం విద్యార్థులను తరలించాలని, ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు ఆదేశించారు.

Tags:    

Similar News