Karimnagar: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.. పోలీసులతో భారీ తోపులాట!
Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
Karimnagar: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.. పోలీసులతో భారీ తోపులాట!
కరీంనగర్: విద్యార్థులను 'క్రిమినల్స్' అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమయంలో పోలీసులు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. బీజేవైఎం కార్యకర్తలు బయట నుండి దిష్టిబొమ్మను అంటుకొని తీసుకొచ్చి కాలుస్తున్న సమయంలో కాగితాలు, బొమ్మలో ఉన్న ఇతర వస్తువులు మంటతో సహా కొందరిపై పడడంతో అప్రమత్తమైన పోలీసులు దాన్ని గుంజుకొని అక్కడే ఉన్న నీటిలో పడవేశారు.అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.