Thangallapalli: కార్తీక పౌర్ణమి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి!
Thangallapalli: తంగళ్లపల్లి మండలం రామచంద్రపురంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు.
Thangallapalli: కార్తీక పౌర్ణమి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి!
రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రెడ్డబోయిన గోపిని చిరు సన్మానంతో గౌరవించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజారావు, జిల్లా అధికార ప్రతినిధి రేగుల శ్రీకాంత్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సందేవేణి రాజు, సిరిసిల్ల మున్సిపల్ 20వ వార్డు ఇన్చార్జి కొట్టే భాను, సారంపల్లి గ్రామ ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ, బూత్ అధ్యక్షుడు ముత్యం, గంధం రాజు, శ్రీశైలం శరత్ తదితరులు పాల్గొన్నారు.