Jagitial: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అడువాల జ్యోతి
Jagitial: హైదరాబాద్‌లో రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Jagitial: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అడువాల జ్యోతి
జగిత్యాల: రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను సీఎం నివాసంలో ఆయనతో కలిసి జరుపుకున్నారు.
అంతకుముందు శ్రావణ మూడో శుక్రవారం సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో జ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.