Tuni: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల వినూత్న ప్రచారం!

Tuni: కాకినాడ జిల్లా తునిలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

Update: 2026-08-30 10:57 GMT

Tuni: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల వినూత్న ప్రచారం!

​తుని, ఆగస్ట్ 30: తుని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ​శ్రీ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు పెద్దాపురం SDPO తిలక్ పర్యవేక్షణలో ఉదయం కొండ వారి పేట, అమ్మాజీ పేట, సీతారాంపురం మరియు నెహ్రూ నగర్ ప్రాంతాలలో ఈ అవగాహన కార్యక్రమం సాగింది. తుని టౌన్ CI ఎం. గీతా రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు పలు కీలక చర్యలు చేపట్టారు.

​అనుమానాస్పద ప్రాంతాలలో తిరుగుతూ గంజాయి సేవిస్తున్న వారి కోసం మరియు విక్రయించే వారి ఆచూకీ కోసం సమాచారాన్ని సేకరించారు. ​శాంతిభద్రతల పరిరక్షణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ​మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువతపై వాటి తీవ్ర ప్రభావం మరియు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి ప్రజలకు వివరించారు. ​సమాజం నుండి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Tags:    

Similar News