Tuni: తుని రైల్వే స్టేషన్‌లో పాముల బెడద.. ప్రయాణికుల తీవ్ర భయాందోళన

Tuni: కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో విష సర్పాల సంచారం. వాష్ రూమ్‌లు, టికెట్ కౌంటర్ల వద్ద పాములు రావడంతో భయాందోళనలో ప్రయాణికులు.

Update: 2026-06-30 03:26 GMT

Tuni: తుని రైల్వే స్టేషన్‌లో పాముల బెడద.. ప్రయాణికుల తీవ్ర భయాందోళన

తుని: ప్రయాణికులు రద్దీగా తిరిగే చోటే విష సర్పాలు సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. వాష్ రూమ్ లో, టికెట్ కౌంటర్ల వద్ద, పార్సిల్ కార్యాలయం వద్ద పాములు ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెడుతున్నారు.

స్టేషన్ ప్లాట్‌ఫాంపై, వెయిటింగ్ హాల్‌లో కూడా పాములు కనిపించడంతో మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పెరగడంతో పాములకు ఆవాసంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే అధికారులు వెంటనే స్పందించి స్టేషన్‌ను పూర్తిగా శుభ్రం చేయించి, పాములు పట్టే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించాలని, లేనిపక్షంలో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.

Tags:    

Similar News