Yanam: హెలికాప్టర్‌లో యానాం చేరుకున్న మంత్రి మల్లాడికి అపూర్వ స్వాగతం
Yanam: పుదుచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు స్థానిక ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Yanam: హెలికాప్టర్‌లో యానాం చేరుకున్న మంత్రి మల్లాడికి అపూర్వ స్వాగతం
యానాం: పుదుచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు శుక్రవారం యానాం చేరుకున్నారు. యానాం ఫెర్రీరోడ్ ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన దిగడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి యానాం చేరుకున్న మల్లాడి కృష్ణారావుకు అపూర్వ స్వాగతం లభించింది.
హెలికాప్టర్ దిగిన వెంటనే యానాం పరిపాలనాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫెర్రీరోడ్ పరిసర ప్రాంతాలు జన సందోహంతో కళకళలాడాయి. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ, డప్పుల వాయిద్యాలతో అభిమానులు సంబరాలు నిర్వహించారు.
అనంతరం హెలికాప్టర్ దిగిన ప్రదేశం నుండి మంత్రి మల్లాడి కృష్ణారావు ఓపెన్ టాప్ వాహనంలో భారీ ర్యాలీగా తన నివాసానికి బయలుదేరారు. ర్యాలీ మార్గమంతా ప్రజలు రోడ్ల పక్కన నిలబడి పూల వర్షం కురిపిస్తూ మంత్రికి అభినందనలు తెలిపారు. యువత భారీ బైక్ ర్యాలీలతో మంత్రిని అనుసరించగా, మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.