Duvvuru: ఎరువుల షాపుపై విజిలెన్స్ దాడి 19.75 టన్నుల స్టాక్ సీజ్!

Duvvuru: దువ్వూరులోని శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రూ. 1.94 లక్షల విలువైన 19.75 టన్నుల ఎరువుల స్టాక్‌ను సీజ్ చేశారు.

Update: 2026-08-11 01:20 GMT

Duvvuru: ఎరువుల షాపుపై విజిలెన్స్ దాడి 19.75 టన్నుల స్టాక్ సీజ్!

Duvvuru: వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1,94,990 విలువైన 19.75 మెట్రిక్ టన్నుల ఎరువుల స్టాక్‌ను అధికారులు సీజ్ చేశారు.

​విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ జి. లక్ష్మణ్ (G. Laxman) తమ సిబ్బందితో కలసి మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాపుల్లో నిర్వహించే స్టాక్ రిజిస్టర్ బుక్ నిల్వలకు, గోడౌన్లలో ఉన్న ప్రత్యక్ష నిల్వలకు తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

​రికార్డుల్లో చూపించిన దానికంటే గోడౌన్లలో నిల్వలు తేడాగా ఉండటంతో నిబంధనల ఉల్లంఘన కింద యూరియా, డీఏపీ (DAP), ఎస్‌ఎస్‌పీ (SSP), అమ్మోనియం సల్ఫేట్ వంటి 19.75 మెట్రిక్ టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుకాణదారులపై 6A (Essential Commodities Act) కింద కేసు నమోదు చేసినట్లు ఆఫీసర్ ఏవో అమర్నాథ్ రెడ్డి తెలిపారు.

​రైతులకు ఎరువుల కొరత సృష్టించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా, రికార్డుల్లో అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ అమర్నాథరెడ్డి స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News