Rayachoti: కుక్కల బెడదతో ప్రయాణికులు, స్థానికుల బెంబేలు!

Rayachoti: వందల సంఖ్యలో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రయాణికులు, మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2026-08-16 14:32 GMT

Rayachoti: కుక్కల బెడదతో ప్రయాణికులు, స్థానికుల బెంబేలు!

రాయచోటి: గాలివీడు బస్టాండ్‌ పరిసరాల్లో వీధి కుక్కలు ఇష్టానుసారంగా సంచరిస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో వందల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, మహిళలు, చిన్నారులు కుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. 

కుక్కల బెడదపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టి ప్రయాణికులకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గాలివీడు బస్టాండ్‌లో కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News