Rayachoti: రాయచోటి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కిషోర్ కుమార్

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రత్యేక నిధులతో 5 ఎకరాల్లో నూతన ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఈడీ కిషోర్ కుమార్ వెల్లడించారు.

Update: 2026-08-08 04:56 GMT

Rayachoti: రాయచోటి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కిషోర్ కుమార్

రాయచోటి, అన్నమయ్య జిల్లా:

రాయచోటి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ..ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఆర్ కె కిషోర్ కుమార్

రాయచోటి బస్టాండ్ కి నిధులు మంజూరు చేయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఆర్ కె కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం రాయచోటి డిపో మేనేజర్ మహేశ్వర్ రెడ్డి తో కలిసి బస్టాండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాయచోటి ప్రజలకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్వరలోనే ఐదు ఎకరాలలో కొత్త బస్టాండ్ ను ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బస్టాండ్ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి అంగీకరించారని తెలపారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలు కప్పి ఘనంగా సన్మానించారు.

Tags:    

Similar News