Rayachoti: రాయచోటిలో అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజ, అభిషేక మహోత్సవం!

రాయచోటి: గురువారం రాత్రి రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజ, అభిషేక కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ప్రసాద్ బాబు గారికి అయ్యప్ప స్వాములు, భక్తులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ…అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాకుండా క్రమశిక్షణ, నియమ నిష్ఠలు, సమానత్వం, సేవాభావం వంటి గొప్ప విలువలను మనకు నేర్పుతుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అన్నదానం వంటి కార్యక్రమాలు పేదలకు ఆకలి తీర్చడంతో పాటు సమాజంలో సోదరభావం, మానవత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వాముల భక్తి, ఆతిథ్యం, ఆధ్యాత్మిక సేవలను అభినందిస్తూ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags: