Rajampet: తాళ్లపాకలో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి శేష వాహన సేవ

Rajampet: రాజేంపేట మండలం తాళ్లపాకలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా కన్నులపండువగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామివారి శేష వాహన సేవ.

Update: 2026-07-26 01:13 GMT

Rajampet: తాళ్లపాకలో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి శేష వాహన సేవ

రాజేంపేట: రాజేంపేట మండలం తాళ్లపాక గ్రామంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శేష వాహన సేవ కన్నులపండువగా జరిగింది.

శోభాయమానంగా అలంకరించిన బంగారు శేష వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య వాహన సేవ వైభవంగా సాగింది. ఆదిశేషుని పడగల నీడలో స్వామిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు నశిస్తాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాళ్లపాక గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags:    

Similar News