Proddatur: వైసీపీ పాలనపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శలు
Proddatur: వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రోడ్లు దెబ్బతిన్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శ. ఎరువుల నల్లబజారుపై కఠిన చర్యలకు ఆదేశం.
Proddatur: వైసీపీ పాలనపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శలు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గత వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.
ప్రస్తుతం కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని తెలిపారు. "తల్లికి వందనం" పథకం ద్వారా ప్రతి విద్యార్థికి లబ్ధి అందిస్తున్నామని, రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలని సూచించారు.
ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.