Kadiri: యుటిఎఫ్ ధర్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్!
Kadiri: కదిరి అంబేద్కర్ సర్కిల్‌లో యుటిఎఫ్ నిరసన. నీట్ పేపర్ లీకేజీ, టెట్ పరీక్షల వివాదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.
Kadiri: యుటిఎఫ్ ధర్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్!
Kadiri: రాష్ట్ర యుటిఎఫ్ శాఖ పిలుపుమేరకు సోమవారం సాయంత్రం కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు యుటిఎఫ్ కదిరి డివిజన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థులను,టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురి చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని యూటియఫ్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాసులు , యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ తాహెర్ వలి, కార్యదర్శులు మల్లికార్జున, రవివర్ధన్ రెడ్డి,జిల్లా నాయకులు సునీల్ కుమార్, మధుసూదన్, సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా యుటియఫ్ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష లీకేజీ వల్ల 20మందికి పైగా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఎన్ఐఎ ను రద్దు చేసి, నీట్ పరీక్షను రాష్ట్రాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. నీట్ పరీక్షలు రద్దు, విద్యారంగ ప్రక్షాళన, విద్యామంత్రి తక్షణం రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణ, సామాజిక విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను భగ్నంచేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిచారు.
ఈ కార్యక్రమంలో కదిరి డివిజన్ యుటిఎఫ్ నాయకులు రెడ్డి రాజేశ్, ఖాజా , బ్రాహ్మ , నజీర్, హనీఫ్, మనోహర్, ఖాదర్ భాష , యుగంధర్,ప్రకాష్, షరీఫ్, సుధాకర్, అనిత, పద్మిని, రజిత, ప్రసన్న లక్ష్మీ, చిట్టెమ్మ, విజయ, హరిత తదితరులు పాల్గొన్నారు.