Veeraballi: మై భారత్ ఛాలెంజ్‌లో ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచిన లోకేష్
Veeraballi: కడప జిల్లా వీరబల్లి ఎస్డీకేఆర్ కళాశాల విద్యార్థి వెంకట లోకేష్ మై భారత్ ఛాలెంజ్‌లో ఏపీలో ప్రథమం, జాతీయ స్థాయిలో 5వ స్థానం సాధించి ఘనత.
Veeraballi: మై భారత్ ఛాలెంజ్‌లో ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచిన లోకేష్
వీరబల్లి: యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్ పోర్టల్ ద్వారా దేశ నిర్మాణానికి మరియు స్వావలంబనకు దోహదపడేలా రోజువారీ చర్యలను ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త డిజిటల్ ప్రచారమే నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ అని విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి అన్నారు.
మంగళవారం స్థానిక ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాలలో మై భారత్ నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ లో ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో నిలిచిన వెంకట లోకేష్ కు అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్బంగా సురేంద్రారెడ్డి మాట్లాడుతు వెంకట లోకేష్ వీరబల్లి ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రధమ సంవత్సరం చదువుతు ఈ పోటీలకు సిద్ధమయ్యాడని ఈ పోటీలకు జాతీయ స్థాయిలో పది లక్షలు మంది పాల్గొన్నారని జాతీయ స్థాయిలో ఐదవ స్థానం ఆంధ్రప్రదేశ్ లో ప్రధమ స్థానాన్ని సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని తెలిపారు.
అనంతరం వెంకట లోకేష్ ను విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి,మెప్మా ఆఫీసర్ అబ్బాస్ అలీ ఖాన్ కళాశాల సిబ్బంది వెంకటరమణ, గీత, అంజలి, విద్యార్థులు పాల్గొన్నారు.