Kadapa: దళిత రైతు డి-పట్టా భూమి అన్యాక్రాంతంపై తహశీల్దార్‌కు వినతి
Kadapa: కడప జిల్లా కాశినాయన మండలంలో దళిత రైతుకు కేటాయించిన డి-పట్టా భూమిని ఆక్రమించి బోరు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
Kadapa: దళిత రైతు డి-పట్టా భూమి అన్యాక్రాంతంపై తహశీల్దార్‌కు వినతి
కడప: వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ సబ్ డివిజన్ శ్రీ అవధూత కాశినాయన మండలం శివరామపాలగిరి గ్రామం ఎస్సీ మాల కులమునకు చెందిన బాల సుబ్బయ్య గారి లక్ష్మయ్య S/O రామయ్య అనువారికి 1986 సంవత్సరంలో సర్వేనెంబర్ 703/1 నందు డి పట్టా నెంబర్ 38/95 గా 5.00ఎకరములు వ్యవసాయభూమిని ప్రభుత్వం మంజూరు చేసి ఉన్నది.
నాటి నుంచి 2010 వరకు సదరు భూమిని సాగు చేసుకొనుచున్నారు.అయితే 2010 లో చిన్నపు నారాయణమ్మ W/O సిద్ధారెడ్డి మురుకుటి నారాయణమ్మ W/O చెన్నకృష్ణారెడ్డి మధ్య సదరు భూమి విషయంలో వివాదం ఏర్పడడంతో 2010లో రెవిన్యూ వారు సదరు భూమిలో దిగవద్దని ఇరువురికి నోటీసులు జారీ చేయడం జరిగినది అప్పటినుండి ఇరువురము సాగు చేయలేదు.
ప్రస్తుతం సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం లీడర్ గా కొనసాగుతున్న యంబడి పోలయ్య అను వ్యక్తి సదరు పొలం నందు దౌర్జన్యం గా దిగి పొలం నాది అని రాత్రికి రాత్రి బోరు వేసి సిపిఎం పార్టీని అడ్డుపెట్టుకుని అధికారులు మేనేజ్ చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నాడు.
సదరు సమస్య విషయమై బాధితులు మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షులు జక్కుల కిరణ్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్యాల ప్రసాదరావు మరియు సీనియర్ దళిత నాయకులు ముత్యాల చెన్నారాయుడు మరియు పలువురు ప్రజా సంఘాల నాయకులను సంప్రదించగా వారంతా కాశినాయన మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించి అక్రమంగా బోరు వేసిన యంబడి పోలయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకుని సదరు బోర్ ను వెంటనే సీజ్ చేయాలని కోరడం జరిగినది.అందుకు తాహసిల్దార్ గారు స్పందిస్తూ రెండు రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాలమహానాడు జక్కుల కిషోర్,చాటకొండ రవి బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.