Kadapa: ఎంపీ అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి తీవ్ర వ్యాఖ్యలు!
Kadapa: పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం. వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు భయపడుతోందని, సీబీఐపై మాట్లాడే హక్కు లేదని విమర్శ.
Kadapa: ఎంపీ అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి తీవ్ర వ్యాఖ్యలు!
Kadapa: కడప పులివెందుల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీటెక్ రవి.“ఊరు గొప్ప.. పేరు దిబ్బ” అన్నట్లుగా వైఎస్ కుటుంబీకుల పరిస్థితి ఉందని విమర్శ.
ఎన్నికలకు భయపడే వైఎస్సార్‌సీపీ.. కోర్టుల చుట్టూ తిరుగుతోంది, వార్డుల మార్పు పేరుతో ఎన్నికలపై స్టే కోరడం సరికాదు.పిటిషన్ ఉపసంహరించుకుని నేరుగా ఎన్నికలను ఎదుర్కోవాలి. మైనర్ విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు తరలించడంపై బీటెక్ రవి ఆగ్రహం.
తల్లిదండ్రులు, విద్యాసంస్థల అనుమతి లేకుండా విద్యార్థులను తీసుకెళ్లారని ఆరోపణ. విద్యార్థుల తల్లిదండ్రులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. విద్యాసంస్థల యాజమాన్యాలే పోలీసులకు ఫిర్యాదు చేశాయని వెల్లడి.
ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు. తాడిపత్రి–ముద్దనూరు ఫోర్‌లేన్ అనుసంధానంపై ఎంపీ స్పందించాలి.“ఇవాళ నీకు సీబీఐ గుర్తుకొచ్చిందా?” అంటూ అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి ఫైర్.
“వివేకా హత్య కేసులో సీబీఐ వచ్చినప్పుడు కర్నూలులో పోలీసుల వెనుక దాక్కున్నావు” అంటూ ఘాటు వ్యాఖ్యలు. “సీబీఐ అంటే కనీసం గౌరవం కూడా లేదు.. ఇప్పుడు సీబీఐ గురించి మాట్లాడుతున్నావా?”.
గతంలో సీబీఐ విచారణల సమయంలో జరిగిన ఆందోళనలను గుర్తు చేసిన బీటెక్ రవి. ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు.