Porumamilla: అక్కలరెడ్డిపల్లె ఇనాం భూముల ఆక్రమణ ఎమ్మార్పీఎస్ న్యాయం డిమాండ్
Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లెలో మాదిగ ఇనాం భూముల ఆక్రమణపై ఎమ్మార్పీఎస్ నేత దాసరపల్లి కిరణ్ కుమార్ మాదిగ ఆగ్రహం.
Porumamilla: అక్కలరెడ్డిపల్లె ఇనాం భూముల ఆక్రమణ ఎమ్మార్పీఎస్ న్యాయం డిమాండ్
Porumamilla: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో ఎస్సీ మాదిగలకు చెందిన మాదిగ ఇనాం భూమి సర్వేనెం 1326A ,1326B లుగా సుమారు 7.50 ఎకరాలు ఉంది. కానీ ఈ భూమి తాలూకు ఒక్క సెంటు కూడా మాదిగలకు చెందకుండా ఇతర కులాలకు సంబంధించిన వారు ఆక్రమించి అడిగితే మీ పెద్దవాళ్లు మాకు అమ్మినారు అనే కల్లుబోల్లు మాటలు చెప్పి మాదిగలకు చెందాల్సిన ఇనాం భూమిని అక్రమంగా అనుభవిస్తు అక్రమ కట్టడాలు కట్టిన వారిపై చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇప్పించాలని అక్కలరెడ్డిపల్లె మాదిగలు.
గతంలో పోరుమామిళ్ల ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని ప్రస్తుతం ఉన్న ఎమ్మార్వో ఈ విషయాన్ని గ్రహించి అక్కలరెడ్డిపల్లి మాదిగలకు న్యాయం చేయాలని ఇదే విషయంపై గతంలో ఇచ్చిన అర్జీపై వీఆర్వో సుబ్రహ్మణ్యం ఎటువంటి వివరణ కూడా ఇవ్వకుండా మాన్యంపై ఎటువంటి సమస్య లేదని అధికారులను తప్పుదోవ పట్టించడం కూడా జరిగిందని ఇప్పటికైనా చొరవ తీసుకొని మాదిగలకు న్యాయం చేయాలని లేనియెడల జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుల ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేసి అక్కలరెడ్డిపల్లి మాదిగలకు అండగా ఉంటామని పోరుమామిళ్ల మండల ఎమ్మార్పీఎస్ నాయకులు దాసరపల్లి కిరణ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బాధితులు అక్కలరెడ్డిపల్లె మాదిగలు ఆరోగ్యం, ప్రభాకర్,సామేలు, వినోదు, చిన్నప్ప,సునీల్, రమేష్, చిన్ని, రామయ్య,సిలువయ్య, తదితరులు పాల్గొన్నారు.