Nellore: ఇసుక, కంకర రోడ్లపై పోస్తే కఠిన చర్యలు నెల్లూరు నగరపాలక సంస్థ కొత్త రూల్స్

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై భవన నిర్మాణ సామాగ్రిని డంపు చేసే వారిపై మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 9:45 AM IST
Nellore
X

Nellore: ఇసుక, కంకర రోడ్లపై పోస్తే కఠిన చర్యలు నెల్లూరు నగరపాలక సంస్థ కొత్త రూల్స్

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో నూతన భవన నిర్మాణాలు జరిపే సమయంలో భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపై డంపు చేసి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై మున్సిపల్ యాక్ట్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై.ఓ నందన్ ఒక ప్రకటన ద్వారా బుధవారం తెలియజేశారు.

ఇటుకలు,కంకర, ఇసుక తదితర భవన నిర్మాణ సామాగ్రి తరలించే సమయంలో లారీలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు ఇతర వాహనాలపై పూర్తిస్థాయిలో నగరపాలక సంస్థ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా వాహనాల యజమానులు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

భవన నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ లేదా కూల్చివేతలకు సంబంధించిన శిధిలాలను రోడ్లపై ఉంచకుండా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సంబంధిత వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story