Malkajgiri: మెకానిక్‌ల సంక్షేమానికి కృషి చేస్తాం: నూతన కార్యవర్గం!

Malkajgiri: మల్కాజిగిరి వినాయక్‌నగర్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది.

Update: 2026-08-30 11:42 GMT

Malkajgiri: మెకానిక్‌ల సంక్షేమానికి కృషి చేస్తాం: నూతన కార్యవర్గం!

Malkajgiri: వినాయక్‌నగర్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు.ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా సి.హెచ్. శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో భీమన్ నరేష్ విజయం సాధించి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అడ్వైజర్‌గా జి. రాజేష్, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రయ్య, నాగేందర్, ట్రెజరర్‌గా షేక్ ఫరీద్, జాయింట్ సెక్రటరీలుగా సాగర్, బి. రాజు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సురేష్, మురళి, కిషోర్, రామ్మోహన్ ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. టూ వీలర్ మెకానిక్‌ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, అసోసియేషన్ అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News