Hyderabad: ఘనంగా ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు
Hyderabad: కమలానగర్‌లోని ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Hyderabad: ఘనంగా ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు
హైదరాబాద్: ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్ లోని ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ(పిడిసి)లో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో ప్రతిభను వెలికితీసి కళలకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. నృత్య కళ ద్వారా యువతకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందుతాయని పేర్కొన్నారు.
నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా సంస్థను నిర్వహిస్తూ అనేక మంది యువ కళాకారులను తీర్చిదిద్దుతున్న కొరియోగ్రాఫర్ ప్రవీణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడే తత్వం ఉంటే పేదరికం ఎప్పటికీ అడ్డంకి కాదని, పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.
చిన్ననాటి నుంచే కష్టపడి, తన ప్రతిభతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్టూడియో ఏర్పాటు చేసి ఎంతోమంది పిల్లలు, యువకులకు శిక్షణ ఇస్తూ కొరియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దుతున్న తీరు ప్రశంసనీయమని తెలిపారు.
యువత చదువుతో పాటు కళల రంగంలోనూ రాణించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తులో గొప్ప అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంస్థ వార్షికోత్సవ కేక్ కట్ చేసి, విద్యార్థుల నృత్య ప్రదర్శనలను ఎమ్మెల్యే వీక్షించి వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, ఆకుల మహేందర్, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, సలహాదారులు బెలిదే అశోక్ గుప్తా, ఉపాధ్యక్షులు యావాపురం రవి, జర్నలిస్ట్ సుధాకర్, పిడిసి యజమాని ఉల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.