Vanasthalipuram: గంజాయి సేవిస్తూ ఇద్దరు యువకుల అరెస్టు!
Vanasthalipuram: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Vanasthalipuram: గంజాయి సేవిస్తూ ఇద్దరు యువకుల అరెస్టు!
Vanasthalipuram: ఎల్బీనగర్ ..,గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం సాహెబ్‌నగర్‌లోని బాల్‌రెడ్డి గ్రౌండ్ సమీపంలో దాడి నిర్వహించింది.
ఈ దాడిలో చింతల్‌కుంట సరస్వతీనగర్‌కు చెందిన గుర్రపు హర్ష్ రోహిత్ (19), వనస్థలిపురం పోలీస్ కాలనీకి చెందిన కోట కృపాకర్ (21) లను గంజాయి సేవిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఇద్దరికీ స్నేహితుల ద్వారానే గంజాయి అలవాటు అయినట్లు వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.