Hyderabad: తెలంగాణ జైళ్ల శాఖలో 80వ స్వాతంత్య్ర వేడుకలు!

Hyderabad: హైదరాబాద్ SICA గ్రౌండ్స్‌లో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జైళ్ల శాఖ డీజీ Dr. సౌమ్య మిశ్రా.

Update: 2026-08-15 07:03 GMT

Hyderabad: తెలంగాణ జైళ్ల శాఖలో 80వ స్వాతంత్య్ర వేడుకలు!

Hyderabad: తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

SICA పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో జైళ్ల శాఖ డీజీ Dr. సౌమ్య మిశ్రా లతో పాటు, జైళ్ళ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు.

విధుల్లో ప్రతిభ, అంకితభావంతో సేవలందించిన వారిని అధికారులు అభినందించారు.

అలాగే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ఖైదీలలో నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా తయారు చేసిన వివిధ ఉత్పత్తులను స్టాల్స్‌లో ప్రదర్శించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

Tags:    

Similar News