ORR Accident: ఓఆర్‌ ఆర్‌ పై ఘోర ప్రమాదం..ఆరుగురు స్పాట్‌ డెడ్‌!

ORR: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ పై వేగంగా వచ్చిన కారు నిలిచిన లారీని ఢీకొని ఆరుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది

Update: 2026-05-01 12:47 GMT

Outer Ring Road accident

Outer Ring Road Accident:  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలో నెహ్రు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మార్గంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడంతో ఈఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన స్థానికులను, తోటి వాహనదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 సమీపంలో..

ఈ ప్రమాదం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక భారీ లారీని, వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు లారీ వెనుక భాగంలోకి పూర్తిగా దూసుకుపోయి ఇరుక్కుపోయింది. దీంతో కారు పైభాగం పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోవడంతో, ఆరుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

చిన్నపిల్లలు కూడా... 

మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు సమాచారం అందించారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఆరుగురు చనిపోగా మిగిలిన ఆ ఒక్కరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

పోలీసులకు పెద్ద సవాలుగా... 

లారీ కింద ఇరుక్కుపోయిన కారును బయటకు తీయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. భారీ క్రేన్ల సహాయంతో కారును వెలికితీసి, లోపల ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించడం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.


Full View


Tags:    

Similar News