Shabad: ఘనంగా ఇందిరమ్మ ఇంట గృహప్రవేశం.. సంతోషంలో లబ్ధిదారురాలు

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దవేడు గ్రామానికి చెందిన చక్కటి సుశీలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి సొంతింటి కల నెరవేరింది. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం జీవితకాల స్వప్నమని, అలాంటి కలను ప్రభుత్వం నెరవేర్చడం సంతోషకరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సంతోషం వ్యక్తం చేసిన చక్కటి సుశీల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: