Rangareddy: తుర్కయంజాల్ లో రెవెన్యూ అధికారులపై మహిళ దాడి

Rangareddy: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో రెవెన్యూ అధికారులపై మహిళ దాడి.

Update: 2026-06-19 08:16 GMT

Rangareddy: తుర్కయంజాల్ లో రెవెన్యూ అధికారులపై మహిళ దాడి

రంగారెడ్డి జిల్లా: తుర్కయంజాల్ లో రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాదంలో ఉన్న భూమి విషయంలో ఆర్డీవో, తహసీల్దార్ ఆదేశాల మేరకు వెళ్లిన ఆర్ఐ గల్లా పట్టి ఈడ్చుకెళ్లింది.

తుర్కయంజాల్ లోని సర్వేనంబర్ 338లో 1810 గజాల భూమి విషయంలో వివాదం నెలకొనగా.. ఆదిబట్ల సీఐ విజ్ఞప్తి మేరకు ఆర్డీవో సంబంధింత భూమిని ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని ఆర్డర్ జారీ చేశారు.

అనంతరం, అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్, జీపీవోలను ఉన్నతాధికారులు అక్కడికి పంపించారు. ఈ క్రమంలో వివాదంలో భూమి వద్దకు వెళ్లిన ఆర్ఐ, జీపీవోతో అక్కడే ఉన్న ఓ మహిళ గొడవకు దిగింది.

అధికారులేనని గ్యారంటీ ఏంటంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. ఆర్ఐ గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఐడీ కార్డు చూపించగా దాన్ని లాక్కుని, దుర్భాషలాడింది.

Tags:    

Similar News