Ranga Reddy: సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక భవన నిర్మాణంపై చర్చ!
Ranga Reddy: అబ్దుల్లాపూర్మెట్ తారామతిపేటలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి, వృద్ధుల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Ranga Reddy: సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక భవన నిర్మాణంపై చర్చ!
Ranga Reddy: తారామతిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యుల నెలవారీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యకలాపాలు, విధివిధానాలు, భవిష్యత్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారు.
అలాగే గ్రామంలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక భవనం నిర్మించేందుకు అనువైన ఖాళీ స్థలాన్ని గుర్తించాలని నిర్ణయించారు. స్థలం గుర్తించిన అనంతరం భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని సమావేశంలో తెలిపారు.
సంఘం కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, త్వరలో మరో మండలస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Next Story




