Mirpet: మీర్ పేట్‌లో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్!
Mirpet: మీర్ పేట్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్. అనుమతి లేని 33 బైకులు సీజ్, గుట్కా, మద్యం స్వాధీనం. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్.
Mirpet: మీర్ పేట్‌లో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్!
Mirpet: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌లో అర్ధరాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
కార్డన్ సెర్చ్‌లో అనుమతులు లేని 33 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను గుర్తించి, వాటి యజమానుల నుంచి చలాన్లు వసూలు చేశారు.
అదేవిధంగా అనుమానితులు, రౌడీషీటర్లను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లతో పాటు గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.