బాబు ఇంట్లో మోదీ విందు.. పవన్ ఆరోగ్యానికి ప్రధాని పరామర్శ!
Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ కీలక భేటీలు. పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని, అనంతరం చంద్రబాబు నివాసంలో అల్పాహార విందు.
బాబు ఇంట్లో మోదీ విందు.. పవన్ ఆరోగ్యానికి ప్రధాని పరామర్శ!
Hyderabad: రిజర్వడ్ టైం 5:15 నుండి 6:15 సమయంలో ప్రధాని మోదీ కీలక భేటీ.. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాలకు వెళ్లనున్న మోదీ.. పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోనున్న మోదీ.. చంద్రబాబుతో తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం.
ముందుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లనున్న మోడీ.. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్న మోడీ. అక్కడి నుండి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న మోదీ. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఇంటిదగ్గర ప్రధాని మోడీ కాన్వాయ్ ట్రైలర్ నిర్వహించిన భద్రతాధికారులు. హైదరాబాదులో ఉన్న చంద్రబాబు, లోకేష్ చంద్రబాబు ఇంట్లో మోడీకి అల్పాహార విందు, మోడీతో అనేక అంశాలు మాట్లాడనున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. HICC నుంచి తిరుగు ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ.