Pargi: అమెరికా పర్యటన ముగించి స్వదేశానికి రామ్మోహన్ రెడ్డి!
Pargi: అమెరికా ఏటా వేడుకల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం.
Pargi: అమెరికా పర్యటన ముగించి స్వదేశానికి రామ్మోహన్ రెడ్డి!
PARGI: అమెరికాలో జరిగిన ATA సభల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి పరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిని పరిగి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలిసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే రాకతో విమానాశ్రయ పరిసరాల్లో సందడి నెలకొంది.
అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డితో కలిసి ఫొటోలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.