Miyapur: మియాపూర్‌లో ఘోరం.. అప్పు తీర్చలేదని దంపతుల అక్రమ నిర్బంధం!

Miyapur: హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది.

Update: 2026-07-15 01:51 GMT

Miyapur: మియాపూర్‌లో ఘోరం.. అప్పు తీర్చలేదని దంపతుల అక్రమ నిర్బంధం!

Miyapur: అప్పు తీర్చలేదనే నెపంతో ఒక దంపతులను అక్రమంగా నిర్బంధించి, గత నాలుగేళ్లుగా వారి చేత బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తున్న దారుణమైన ఘటన హైదరాబాద్‌ శివార్లలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (MRI) ఎ. శ్రీను అందించిన పంచనామా నివేదిక ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలానికి చెందిన శ్రీ కోట శ్రీనివాస్ (40), తండ్రి కృష్ణారావు, తన భార్య రమ్య వైద్య ఖర్చుల నిమిత్తం గతంలో కాంట్రాక్టర్ రాములు వద్ద ₹2,004,000/-, అలాగే మరో కాంట్రాక్టర్ కృష్ణ వద్ద ₹1,00,000/- చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

అయితే, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదనే కారణంతో కాంట్రాక్టర్లు రాములు, కృష్ణలు మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. శ్రీనివాస్, ఆయన భార్య రమ్యలను బలవంతంగా న్యూ హఫీజ్‌పేట్, ప్రేమ్ నగర్‌లోని ఒక నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకువచ్చారు. అక్కడ వారిని అక్రమంగా బంధించి, గత నాలుగేళ్లుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా బంధిత కార్మికులుగా (వెట్టిచాకిరీ) మార్చి శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారు.

మంగళవారం (జూలై 14) సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎ. శ్రీను ఈ నివేదికను పోలీసులకు సమర్పించారు. బాధితులను అక్రమ నిర్బంధం నుండి విడిపించి, నిందితులైన ఇద్దరు కాంట్రాక్టర్లపై ‘వెట్టిచాకిరీ వ్యవస్థ (నిర్మూలన) చట్టం-1976’తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News