Medipally: మేడిపల్లి ఓయో హోటల్‌లో పేకాట స్థావరం గుట్టురట్టు!
Medipally: మేడిపల్లి పరిధిలోని ఓయో హోటల్‌లో గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.
Medipally: మేడిపల్లి ఓయో హోటల్‌లో పేకాట స్థావరం గుట్టురట్టు!
Medipally: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లిగూడెంలో ఉన్న ఓ ఓయో హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మేడిపల్లి ఎస్‌ఐ ఏ. రవి తన సిబ్బందితో కలిసి ఉన్నతాధికారుల అనుమతితో శనివారం దాడి చేపట్టారు. ఈ సందర్భంగా మస్తాన్, సురేష్, శ్రీను, శంకర్ అనే నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. నిందితుల వద్ద నుంచి మూడు సెట్ల ప్లేయింగ్ కార్డులు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.