Medchal: మేడ్చల్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ; ఎమ్మెల్యే మల్లారెడ్డి!

Medchal: మేడ్చల్ గుండ్లపోచంపల్లిలో తేజ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ; ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.

Update: 2026-08-29 08:23 GMT

Medchal: మేడ్చల్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ; ఎమ్మెల్యే మల్లారెడ్డి!

Medchal: ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు. శనివారం గుండ్లపోచంపల్లి డివిజన్‌ లో తేజ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ సమాజంలో తోటి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తేజ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సమాజ సేవకు తమ వేతనాల నుంచి 20 శాతం మొత్తాన్ని సమాజ సేవ కోసం వెచ్చించడం నేటితరని ఆదర్శ విషయమన్నారు....

Tags:    

Similar News