LB Nagar: వాహనదారులకు అలర్ట్.. జరిమానాలు కట్టకుంటే వాహనాలు వేలం!

LB Nagar: ఎల్బీనగర్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి సీజ్ అయిన 116 వాహనాల యజమానులకు పోలీసులు ఆఖరి అవకాశం ఇచ్చారు.

Update: 2026-06-03 09:00 GMT

LB Nagar: వాహనదారులకు అలర్ట్.. జరిమానాలు కట్టకుంటే వాహనాలు వేలం!

ఎల్బీనగర్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసుల్లో పట్టుబడిన 116 వాహనాలను యజమానులు ఇప్పటివరకు తీసుకెళ్లలేదని ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నోటీసులు ఇచ్చినా స్పందన కరువు: ఈ వాహనాలు పట్టుబడినప్పటి నుంచి ఇప్పటివరకు వాటిపై ఉన్న చలానాల జరిమానాలను యజమానులు చెల్లించలేదు. సదరు యజమానులకు పోస్ట్ ద్వారా నోటీసులు పంపడంతో పాటు పలుమార్లు సమాచారం అందించినా ఎవరూ ముందుకు రాలేదని సీఐ పేర్కొన్నారు.

చివరి అవకాశం: చివరి ప్రయత్నంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నామని, వాహన యజమానులు వెంటనే స్టేషన్‌కు వచ్చి సరైన పత్రాలు చూపించి, పెండింగ్ జరిమానాలు చెల్లించి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు.

లేకుంటే వేలం: నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించి వాహనాలు తీసుకెళ్లని పక్షంలో చట్ట ప్రకారం నిబంధనల మేరకు వేలం వేయడం జరుగుతుందని మీడియా సమావేశంలో సీఐ హెచ్చరించారు.

సరైన సమాచారం కోసం 8712662773 నంబర్‌ను సంప్రదించాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు.

Tags:    

Similar News