LB Nagar: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ శిబిరం
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాక్ హిల్స్ కాలనీలోని ఎస్‌వీఎల్ ఎరీనాలో బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
LB Nagar: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ శిబిరం
ఎల్బీనగర్: గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, AICC రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు BLAల శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాక్ హిల్స్ కాలనీలోని SVL ఎరీనాలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా DCC అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, TPCC ప్రచార కమిటీ చైర్మన్, LB నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్, నియోజకవర్గ కోఆర్డినేటర్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డా. వెన్నెల గద్దర్, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి హాజరై ప్రసంగించారు.
TPCC ట్రైనర్ కృష్ణ చైతన్య BLAలకు SIR ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ, డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో BLAలు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా BLAలు కృషి చేయాలన్నారు. వృద్ధులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజలకు ఓటర్ల నమోదులో ప్రత్యేక సహకారం అందించాలని సూచించారు.
LB నగర్ నియోజకవర్గంలో మొత్తం 577 బూత్‌లు ఉండగా, 6 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నా కేవలం 2 లక్షల ఓట్లు మాత్రమే మ్యాపింగ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన ఓటర్ల వివరాలను కూడా నమోదు చేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లను జాబితాల నుంచి తొలగించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మళ్లీ CM కావాలన్నా BLAలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, రాష్ట్ర యాదవ్ కో-ఆపరేటివ్ కార్పోరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, ముద్దగోని లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.