Kadthal: కడ్తాల్లో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు; విగ్రహానికి పూలమాల వేసి నివాళి.
Kadthal: కడ్తాల్లో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మాదారం గణేష్ గౌడ్ అన్నారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో బీసీ సంక్షేమా సంఘం మండల అధ్యక్షుడు మాదారం గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ రాయికంటి బిక్షపతి హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీ సీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మాదారం గణేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘసంస్కర్త జ్యోతిభా పూలే అన్నారు.
మహిళల అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయుడని, ముఖ్యంగా 1850వ సంవత్సరంలో మహిళలు విద్యకు నోచుకోకుండా సమాజానికి చాలా దూరంగా బ్రతికేవారని, వారి అభ్యున్నతి కోసం తన భార్య అయిన సావిత్రిబాయి పూలే తో కలిసి విద్యాసంస్థలు నెలకొల్పి మహిళలకు విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పి, విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవల్ని గుర్తుంచుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బిసి ఐక్యత కోసం ఫూలే తన జీవితాన్ని ధారపోశారని అన్నారు.
అధిపత్య కులాలపై ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలతో పాటు నిబద్దత అలవరుచుకోవాలని కోరారు. బిసిలు సంఘటితమై అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వచ్చేలా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, ఎండోమెంట్ డైరెక్టర్ పిప్పళ్ల యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, వార్డు సభ్యులు ముత్తి కృష్ణ, గౌరవ అధ్యక్షులు తిరుమలేష్, సీనియర్ నాయకులు చెందోజి, యాదయ్య, లాయక్ అలీ, గురిగళ్ళ రామచంద్రయ్య, మూఢ రవి, మహేందర్, బండ శ్రీను, క్యామ రాజేష్, కేషని మహేష్, రాజేందర్ గౌడ్, కోస్కే ఉపేందర్, ఎగిరిశెట్టి లింగం, చంద్రయ్య, లక్ష్మయ్య, సత్యం తదితరులు ఉన్నారు.