Yousufguda: రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వార పనులకు ఎమ్మెల్యే నవీన్ భూమిపూజ
Yousufguda: యూసఫ్‌గూడ డివిజన్ యాదగిరి నగర్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వారం (కమాన్) నూతన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ భూమిపూజ చేశారు.
Yousufguda: రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వార పనులకు ఎమ్మెల్యే నవీన్ భూమిపూజ
Yousufguda: యూసఫ్‌గూడ డివిజన్‌లోని యాదగిరి నగర్‌లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వారం (కమాన్) నూతన నిర్మాణ పనులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి.నవీన్ యాదవ్ గారు,బీసీ జేఏసీ చైర్మన్, వి.చిన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, బస్తీ వాసులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే రేణుక ఎల్లమ్మ తల్లి కృపాకటాక్షాలు యాదగిరి నగర్ మరియు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే గారు ప్రార్థించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రాంత ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
బస్తీలో నెలకొన్న ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.