Nacharam: కాంగ్రెస్ నేత ప్రకాష్ రెడ్డికి జనప్రియ వాసుల ఘన సన్మానం!

Nacharam: నాచారం జనప్రియ అపార్ట్‌మెంట్స్ బీ బ్లాక్ వాసులు కాంగ్రెస్ నాయకుడు వి.ఎస్. ప్రకాష్ రెడ్డి, చరణ్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.

Update: 2026-08-30 17:12 GMT

Nacharam: కాంగ్రెస్ నేత ప్రకాష్ రెడ్డికి జనప్రియ వాసుల ఘన సన్మానం!

నాచారం: జనప్రియ అపార్ట్‌మెంట్స్ బీ బ్లాక్ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వి.ఎస్. ప్రకాష్ రెడ్డి, వారి కుమారుడు వి.ఎస్. చరణ్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. ప్రకాష్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జనప్రియ బీ బ్లాక్‌లో సుమారు 40 టన్నుల చిప్స్ వేయించి, స్థలాన్ని చదును చేసి ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.

అంతేకాకుండా స్థానికులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు నెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనప్రియ బీ బ్లాక్ వాసులు ప్రకాష్ రెడ్డి, చరణ్ రెడ్డిల సేవలను అభినందిస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షరీఫుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, రేవంత్, అజిత్, సాంబ, అష్రఫ్, జనప్రియ రవి, చందు, జావీద్, శరత్, సంతోష్, అజీమ్, నర్సింగ్ రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News