Hayathnagar: 22-ఏ నిషేధిత జాబితాపై ఆందోళన వద్దు: తహశీల్దార్ జానకి!

Hayathnagar: 22-ఏ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములను మాత్రమే చేర్చామని, ప్రైవేటు భూములను కాదని హయత్‌నగర్ తహశీల్దార్ జానకి స్పష్టం చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

Update: 2026-08-27 15:30 GMT

Hayathnagar: 22-ఏ నిషేధిత జాబితాపై ఆందోళన వద్దు: తహశీల్దార్ జానకి!

హయత్ నగర్: 22-ఏ నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములను చేర్చడం జరగలేదని, ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చినట్లు తహశీల్దార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహశీల్దార్ జానకి తెలిపారు.

అయితే, 22-ఏ నిషేధిత జాబితాలో తమ భూములు చేర్చడంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, అందుకు సంబంధించిన సరైన ధృవపత్రాలను సమర్పించాలని సూచించారు. సమర్పించిన పత్రాలను పరిశీలించి, సమగ్ర నివేదికను సిద్ధం చేసి పై అధికారులకు తదుపరి పరిశీలన, నిర్ణయం నిమిత్తం పంపిస్తామని తెలిపారు.

అలాగే, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలన సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. అవసరమైన పత్రాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు వెంటనే చేపడతామని తెలిపారు. మరింత సమాచారం కోసం సంబంధిత తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని హయత్ నగర్ తహశీల్దార్ జానకి సూచించారు.

Tags:    

Similar News