Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా నందికంటి శ్రీధర్ జన్మదిన వేడుకలు!
Malkajgiri: మల్కాజిగిరి వినాయక్‌నగర్ చౌరస్తాలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా నందికంటి శ్రీధర్ జన్మదిన వేడుకలు!
మల్కాజిగిరి: మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ జన్మదిన వేడుకలు బుధవారం వినాయక్‌నగర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకుడు గుత్తి రామచందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బద్దం పరుశురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి నందికంటి శ్రీధర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రమౌళి, అంజయ్య, ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్, కృష్ణమూర్తి గౌడ్, ఫరీద్, శేఖర్ గౌడ్, సాయి ముదిరాజ్, పేపర్ శీను, ఉమేష్, రంజిత్, సాయిరాం, వెంకటేష్ చారి, సాయి, స్వామి, లక్ష్మి, అరుంధతి, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.